06-02-2026 05:36:17 PM
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి,(విజయక్రాంతి): తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి రఘునందన్ రెడ్డి గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపర్రె తండా, నెలిబండ తండా 1,2,8,9,10 వార్డుల్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు కోరారు.
గాదరి కిశోర్ కుమార్, మున్సిపాలిటీ సమన్వయకర్త రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చములో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికలో కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసే తిరుమలగిరి మున్సిపల్ సీటును టిఆర్ఎస్ కైవసం చేసుకోవాలని, రఘునందన్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్ వార్డు ఇంచార్జి లు తాటికొండ సీతయ్య, గుండ గాని రాములు గౌడ్ గోపగాని రమేష్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.