21-02-2026 12:38:18 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి):కామారెడ్డి జిల్లా కేంద్రానికి పర్యటన నిమిత్తం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును శుక్రవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి చైర్ పర్సన్ ని అభినందిస్తూ కామారెడ్డి నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.
ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం తరుపున తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ షాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లను మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.