18-02-2026 08:57:42 PM
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటే అభివృద్ధి సాధ్యం: చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు
కోదాడ,(విజయక్రాంతి): సాధారణ ఎన్నికలలో గెలుపొంది కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబు బుధవారం ఇరిగేషన్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేళ్లచెరువులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ కుసుమా బాబు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతోటే నేను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైననని గుర్తు చేశారు.
వారి సహాయ సహకారాలతోటి కోదాడను తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ బార్అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, రావెళ్ళ కృష్ణారావు, ప్రసాద్, దావల్ తదితరులు పాల్గొన్నారు.