పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ
15-03-2026 05:26 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ పాల్గొన్నారు, మున్సిపల్ పరిధిలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రజలు ఆనందంగా, భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లిని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, యువకులు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.




