ఏఐసీసీ దృష్టిలో బెస్ట్ పీసీసీ తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణలో అక్రమంగా ఓట్ల తొలగింపును అడ్డుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. బెంగాల్ లో 31 లక్షల ఓట్లు చేర్చి.. 93 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్(West Bengal)లో టీఎంసీ ఓడింది కూడా 30 లక్షల ఓట్ల తేడాతోనే అన్నారు. రాష్ట్రంలోధాన్యం దిగుబడి పెరగటంతో కోనుగోళ్లలో కొంత జాప్యమైందని వివరించారు. తన పనితీరును ఏఐసీసీ లేదా సీఎం బేరీజు వేస్తారని ఆయన వెల్లడించారు. పత్రికలు, చానల్స్ కు ఎవరి అభిప్రాయం వాళ్ల కు ఉంటుందన్నారు. పీసీసీ మార్పులో ఏఐసీసీదే తుది నిర్ణయమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఏఐసీసీస దృష్టిలోబెస్ట్ పీసీసీ తెలంగాణ అని కేసీ వేణుగోపాల్(K.C. Venugopal) చెప్పారని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
కేబినెట్ విస్తరణతో పీసీసీకి సంబంధంలేదు
మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)తో పీసీసీకి సంబంధం లేదని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. టిపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ చిట్‌చాట్ నిర్వహించారు. హరీష్‌రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు..రద్దు చేసేది లేదని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ రాష్ట్రానికి తలమానికం అన్నారు. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్‌లో నరకం కనిపిస్తోందన్న మహేశ్ గౌడ్ అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేశామని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి అరకొర నిధులు ఇచ్చి వెళ్లారని మండిపడ్డారు. మోదీకి కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన లేదని తెలిపారు.






