23 May, 2026 | 4:01 PM

200 మంది ఉపాధి హామీ కూలీలను కలుసుకున్న ఎమ్మెల్యే

23-05-2026 03:01 PM

వేంసూరు,(విజయక్రాంతి):  వేంసూరు గ్రామంలో సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలను వేంసూరు గ్రామ చెరువు వద్ద కలుసుకున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్   గ్రామ సర్పంచ్ ఫకృద్దీన్, వేంసూరు ఎమ్మార్వో, ఎంపీడీఓతో స్వయంగా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతం వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులుతో మాట్లాడి పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  ఉప ముఖ్య మంత్రి బట్టి మంత్రివర్యులు తుమ్మల పొంగులేటి అందిస్తున్న పథకాలు గురించి ప్రజలకు వివరించారు.

ఎమ్మెల్యే ఉపాధి హామీ కూలీల పని విధానం, ఆరోగ్య సమస్యలు, ఉపాధి హామీ కూలీల బ్యాంక్ డబ్బులు సమస్యలు గురించి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్   ఉపాధి హామీ కూలీలకు మెడికల్ కిట్స్ మరియు మజ్జిగ ప్యాకెట్స్ అందించి మరియు టిఫిన్స్ స్వయంగా  వడ్డీంచిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్  వ విడత ఇందిరమ్మ ఇల్లు, కొత్త ఫించన్ లు కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో అందిస్తుందని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తెలియజేసారు. వేంసూరు గ్రామంలో మోరంపూడి భాస్కరరావు  సతీమణి ని కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.