23 May, 2026 | 3:56 PM

పాలిసెట్‌లో సత్తా చాటిన నిర్మల్ విద్యార్థిని

23-05-2026 03:10 PM

నిర్మల్ టౌన్,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్-2026 ఫలితాల్లో నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన పెంటు మహిత రాష్ట్రస్థాయిలో 72వ ర్యాంకు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. పెంటు సాయిప్రసాద్-సంధ్య దంపతుల కుమార్తె అయిన మహిత ఉన్నత ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కాలనీవాసులు మహితను అభినందించారు.