పేదలకు ఆరోగ్య భరోసా.. సీఎంఆర్‌ఎఫ్
* 150 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు అందజేత
ఖమ్మం: కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల తన క్యాంప్ కార్యాలయంలో ఉభయ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు తన సిఫారసుతో మంజూరైన రూ.44 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి లతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ, లబ్ధిదారుల దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించి, అండగా నిలవడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులంతా ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆటో డ్రైవర్లు, కార్మికులకు అండగా ఉంటాం
అనంతరం వివిధ ఆటో అడ్డాలకు చెందిన వందమంది ఆటో డ్రైవర్లకు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఖాకీ చొక్కాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నిరంతరం శ్రమిస్తూ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో కార్మికులందరికీ తమ ప్రభుత్వం, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అభయమిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో..: నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్, టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, రంజిత్ నాయక్, సీనియర్ నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, మాజీ ఎంపీపీ గోసు మధు, డీసీసీ సెక్రెటరీ రాంపుడి రోశయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఎస్డి. గౌస్, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, చల్లా రామకృష్ణా రెడ్డి, కేకేసీ జిల్లా అధ్యక్షులు విప్లవ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు బాణాల లక్ష్మణ్, మల్లెల నాగేశ్వరరావు, కాటేపల్లి కిరణ్, ఉమర్, ఎండి. గౌస్, మాజీద్, చెరుకుమల్లి రవి, దిరిశెల శ్రీనివాసరావు, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, ఉభయ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






