నిర్మల్ నుండి రామేశ్వరానికి ప్రత్యేక బస్సు
భైంసా,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి జూన్ 5వ తేదీ రోజు పుణ్యక్షేత్రమయిన తమిళనాడులోని రామేశ్వరానికి సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి మ!! 1:30 ని!! లకు నిర్మల్ బస్టాండ్ నుండి బయలుదేరి 6వ తేదీ రోజు ఉ!! 7 గం!! లకు కానిపాకం చేరుకుంటుంది. అక్కడ వరహా దిద్ది వినాయకుణ్ణి దర్శించుకొని తమిళనాడు లోని హోల్డెన్ టెంపుల్ కు వెళ్లి అక్కడి నుండి అరుణాచలం చేరుకుంటుంది. అరుణాచలం లో రాత్రి బస,7 వ తేదీ ఉ!! బయలు దేరి పలని సుబ్రమణ్య స్వామి దర్శనం తర్వాత పాతాళషెంబు మురుగన్ కరంగిల్ మాల దేవాలయం దర్శనం తర్వాత మధురై చేరుకొని అక్కడ రాత్రి బస 8వ తేదీ ఉ!! మధుర మీనాక్షి అమ్మ వారి దర్శనం అనంతరం రామేశ్వరం చేరుకుంటుంది.
రామేశ్వరం లో సముద్ర స్నానం 22 బావుల స్నానం రామనాథ స్వామి టెంపుల్ దర్శనం, ధనుష్కోడి ఇంకా చూడదగిన ప్లేస్ లు చూసి 9 వ తేదీ తిరుగు ప్రయాణం లో శ్రీరంగం రంగనాయకుల స్వామి ని దర్శించుకొని 10 వ తేదీ నిర్మల్ చేరుకొనును. 6 రోజుల యాత్ర ఛార్జి 7500/- ఉంటుంటుందని డిపోమేనేజర్ తెలిపారు. భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలని డిపోమేనేజర్ తెలిపారు. యాత్ర వెళ్లేవారు నిర్మల్ బస్టాండ్ లో గాని మీ మొబైల్ ఫోన్ లో కాని ముందస్తుగా బుక్ చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు: 9959226003, 7382842582 లో సంప్రదించాలని ఆయన తెలిపారు






