కేఎస్‌జి ఫౌండేషన్ సేవలు అమూల్యం
23-05-2026 02:55 PM
మున్సిపల్ వైస్ చైర్మన్ కోన ధనికుమార్
మధిర,(విజయక్రాంతి): కోన సత్యనారాయణ గుప్తా ఫౌండేషన్ సేవలు అమూల్యం అని మున్సిపల్ వైస్ చైర్మన్ కోన ధనికుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని టిబిఎం హైస్కూల్ ప్రాంగణంలో కంటి,గుండె వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు, నాయకులు ప్రారంభించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ... సమాజ సేవే లక్ష్యంగా కేఎస్‌జి ఫౌండేషన్ నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయమని, ముఖ్యంగా గుండె, కంటి వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వైద్య పరీక్షలు నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.






