14 July, 2026 | 6:00 PM

పాలన అధికారి.. పంతులు అయ్యారు

14-07-2026 05:20 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లా పాలనలు పరిపాలించే జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లాలో ప్రజల సంక్షేమంపై దృష్టి పెడుతూనే ప్రభుత్వ విద్యను బలోపితం చేసేందుకు పంతులుగా మారి పాటలు బోధించడం తో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా తరగతి గదిలోకి వెళ్లి చదువుతున్న విద్యార్థులకు బ్లాక్ బోర్డ్ పై పాఠాలు చెప్పి ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు.

దస్తురాబాద్ మండలంలో మంగళవారం కలెక్టర్ కేజీబీవీ పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించి ప్రశ్నలపై సమాధానం చెప్పించుకున్నారు. విద్యార్థులు టకటక సమాధానం చెప్పడంతో వెరీ గుడ్ బాగా చదువుతున్నారు ఇంకా బాగా చదవండి అంటూ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.