14 July, 2026 | 6:00 PM

కళాశాలల బంద్ విజయవంతం

14-07-2026 05:22 PM

బేల,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన కళాశాలల బంద్ మంగళ వారం బేలలో విజయవంతమైందని ఆ సంఘం నాయకుడు మాడవార్ హరీశ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కోరారు.