18 April, 2026 | 8:57 AM

బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

18-04-2026 12:56 AM

ధర్మకర్తలతో కలిసి ఆహ్వానించిన ఆలయ చైర్మన్ పూదరి రమేష్ 

ధర్మపురి,ఏప్రిల్17(విజయక్రాంతి):బ్రహ్మోత్సవ వేడుకలకు హాజరవ్వాలoటూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కోటిలింగాల ఆలయకమిటీ చైర్మెన్ పూదరి రమేష్ ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రం శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరి యు కళ్యాణోత్సవాలు ఈనెల 20 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమవ్వనున్నాయి.

ఈ వేడుకలకు హాజరుకావాలని ధర్మకర్తలతో కలిసి మంత్రిని ఆహ్వానించారు. వీలుచేసుకుని తప్పకుండ హాజరవుతానoటూ మంత్రి సానుకూలత తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మెన్ గోళ్ళ తిరుపతి,దేవస్థాన ఈవో కాంతారెడ్డి, ధర్మకర్తలు గుమ్ముల వెంకటేష్,రాపాక రాయకోటయ్య, మేరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.