మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష
14-07-2026 05:17 PM
మునిపల్లి,(విజయక్రాంతి): డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా మంగళవారం మండల పరిధిలోని బుధేరా చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో సదాశివపేట మండలం రేజింతల్ గ్రామానికి చెందిన బోయిన్ నర్సింలు, సదాశివపేట పట్టణానికి చెందిన మహమ్మద్ నదీమ్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా వారు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
దీంతో సంగారెడ్డి ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయ మెజిస్ట్రేట్ (మార్నింగ్ కోర్టు) న్యాయమూర్తి వి లక్ష్మి కళ ఎదుట హాజరు పరచగా వారికి ఐదు రోజులపాటు జైలు శిక్ష, జరిమానాను విధించినట్టు ఎస్సై అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై అరవింద్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన ధరలు తీసుకుంటామని హెచ్చరించారు.






