calender_icon.png 8 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటును వృథా చేసుకోకండి

08-02-2026 01:58:28 AM

మహబూబ్‌నగర్ మేయర్ స్థానం బీజేపీదే

ప్రచారంలో ఎంపీ డీకే అరుణ 

మహబూబ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి7: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటును ఎట్టి పరిస్థితి లో వృథా చేసుకోకుండా, బీజేపీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్ కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడ వెళ్లాయని, నిరుద్యోగ భృతి, తులం బంగారం ఎక్కడ? అని ప్రశ్నించారు.

18 ఏండ్లు నిండిన మహిళలందరికీ రూ.2,500 ఎవరికిచ్చారని, ఎందుకు ప్రజలకు మాయమాటలు చెపుతారని అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు అన్ని కేంద్రంలోని బీజేపీ నిధులతోనే అభివృద్ధి జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. మహబూబ్‌నగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ అధిష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, అభ్యర్థులు శ్రీలేఖ రాజేందర్ పాల్గొన్నారు.