08-02-2026 01:56:35 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే.. ఇప్పుడు ఏమి లేదు
కార్నర్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఎల్లప్పుడు మీలో ఒకడిగా ఉన్న 12వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి సత్యం యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం 12వ డివిజన్ లో కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. వీరన్నపేట్, కేటీఆర్ నగర్ (డబల్ బెడ్ రూమ్ ఇండ్లు), వీరభద్ర కాలనీ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సత్యం యాదవ్‌కు మద్దతుగా ఇంటిం టా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ సత్యం యాదవ్‌ను ఆశీర్వదించాలని కోరారు.
ఈ సం దర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పదవి లేనప్పుడే సత్యం యాదవ్ ఎంతోమందికి మేలు చేశారని కార్పొరేటర్‌గా గెలిపిస్తే మరింతగా మీకు అండగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందుంటారని తెలిపారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి మళ్లీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదని విమర్శించారు. ప్రతి కుటుంబంలో ఒకడిగా సత్యం యాదవ్ ఉంటారని అందరూ అండగా నిలబడాలని సూచించారు. ఎప్పుడు ఎవరికీ ఆపద వచ్చిన అందుబాటులో ఉండి సేవ చేస్తామని భరోసా ఇచ్చారు. ఎల్లప్పుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రతి సమస్య తమకు తెలుసని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేశారు.