ధైర్యంగా ఉండండి
29-08-2026 11:25 PM
సర్పంచ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ డీకే అరుణ
హన్వాడ: మండల పరిధిలోని పెద్దదర్పల్లి గ్రామం సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్ అత్త లక్ష్మీ దేవమ్మ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఎంపీ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంతో శనివారం గ్రామంలోని వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఎల్లప్పుడూ అండగా ఉంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు ఉన్నారు.






