30 August, 2026 | 1:08 AM

కిడ్నీ సింపోజియం 2026

30-08-2026 12:14 AM

యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో సదస్సు

ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కిడ్నీ మార్పిడి వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు, మార్పిడి అనంతర సంరక్షణ, దీర్ఘకాలిక గ్రాఫ్ట్ ఆరోగ్యం, అవయవదానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో కిడ్నీ సింపోజియం 2026 నిర్వహించారు.

ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, వైద్యులు పాల్గొని తాజా వైద్య పురోగతులు, క్లినికల్ అనుభవాలపై చర్చించారు. కార్యక్రమానికి యశోద హాస్పిటల్స్ చై ర్మన్ జి రవీందర్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సురేందర్‌రావు ప్యాట్రన్లుగా వ్యవహరించగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కిడ్నీ మార్పిడి ఒక కొత్త జీవితానికి ఆశను కల్పిస్తుంది.. ఈ రంగంలో ఆధునిక వైద్య సాంకేతికత, నిపుణులైన వైద్య బృందాల సమన్వయం, మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడం ఎంతో అభినందనీయమన్నారు. యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం, క్లిష్టమైన కే సుల్లోనూ మంచి ఫలితాలను సాధించడం ప్రశంసనీమన్నారు.

అసంబద్ధ కిడ్నీ మార్పిడులు, వృద్ధ రోగులకు ట్రాన్స్‌ప్లాంట్లు వంటి వైద్య సేవలు మరింత మంది రోగులకు ఆశను కల్పిస్తున్నాయన్నారు. యశోద హాస్పిటల్స్ నిర్వహించిన కిడ్నీ సింపోజియం 20 26 వంటి కార్యక్రమాలు వైద్య నిపుణులు, ప్రజలు, సమాజం మధ్య అవగాహనను పెం పొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి సురేందర్ రావు, మా ట్లాడుతూ యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం మాకు ఎంతో గర్వకార ణం అని అన్నారు.యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీ, నెఫ్రాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ య శోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో 400కు పై గా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం మా వైద్య బృందం సమిష్టి కృషికి నిదర్శనమని తెలిపారు.