14 July, 2026 | 7:52 PM

పక్కాగా 'సర్' నిర్వహించాలి

14-07-2026 07:43 PM

- రాజ్యసభ సభ్యురాలు ఆల్కాసింగ్ గుజ్జర్

ఎల్బీనగర్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, బీఎల్వోలు సమగ్ర ఓటరు నమోదు సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ 'ఎస్‌ఐఆర్' ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యురాలు ఆల్కాసింగ్ గుజ్జర్ సూచించారు.  ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ లింగోజిగూడ డివిజన్‌ అధ్యక్షుడు గుండె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ పనితీరు, ఓటరు నమోదు ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు.