14 July, 2026 | 7:47 PM

108 అంబులెన్స్ సేవలపై ఆడిట్

14-07-2026 07:46 PM

ఎల్బీనగర్:  ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 108 అంబులెన్స్ వాహనాల సేవలపై ఎన్టీఆర్ నగర్ లో మంగళవారం నేషనల్ క్వాలిటీ ఆడిటర్ ఫయాజ్ షేక్ సమగ్ర ఫిజికల్ ఆడిట్ నిర్వహించారు. ఉద్యోగమే బాధ్యత సేవే దైవం శ్రమే మా ఆయుధం ప్రజల ఆరోగ్యమే మా ఆకాంక్ష" అనే నినాదంతో 108 సిబ్బంది ప్రతిరోజూ ప్రజా క్షేత్రంలో అంకితభావంతో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్ లో ఉన్న ప్రతి మెడికల్ పరికరాన్ని నిశితంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయాల్లో ఒక క్షణం కూడా విలువైనదే అన్న దృష్టితో ఆక్సిజన్ సిలిండర్లు, సక్షన్ యంత్రాలు, మానిటర్లు, స్ట్రెచర్లు తదితర పరికరాల పనితీరును పరిశీలించారు.

మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, స్టాక్ రిజిస్టర్, పేషెంట్ కేర్ రికార్డులు, కాల్ లాగ్ బుక్స్ వంటి పత్రాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ రాజబాబు,ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నర్సయ్య, సురేష్ , పైలెట్లు సురేష్ , రవికుమార్ అనపర్తి తదితరులు అవసరమైన వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ పీఎం జాన్ షాహీద్ మాట్లాడుతూ... 108 అంబులెన్స్ సేవలు ప్రజలకు అత్యవసర సమయంలో వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలిపారు. 108 అంబులెన్స్ వాహనాలను నిత్యం పరిశీలించాలని సిబ్బందికి సూచించారు.