28 July, 2026 | 12:54 AM

కుల వివక్ష నిర్మూలనకు ఉద్యమం

28-07-2026 12:12 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): కుల వివక్ష, పేదరిక నిర్మూలన కోసం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం రాంనగర్‌లో జరిగిన ఎమ్మార్పీస్, అనుబంధ సంఘాల హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ యువతకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరిగాయని పేర్కొన్న ఆయన, మాదిగలు ఆర్థికంగా, రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు వచ్చే 40 రోజుల పాటు గ్రామాలు, బస్తీల స్థాయిలో నూతన తరం విద్యార్థులు, యువతతో ఎంఆర్‌దీతిజిజిపీఎస్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు గోవింద్ నరేష్, చిలక ఎల్లయ్య, గండి కృష్ణ, గజ్జల రాజశేఖర్, ఎడవల్లి యాదయ్య, టీవీ నరసింహ, డప్పు మల్లికార్జున్, మునిరాజు అరుణ్ కుమార్, మాచర్ల ప్రభాకర్, యాదాసి నర్సింగ్ రావు, మునిరాతి రామకృష్ణ, పూజల్ల రవి, కిషన్ మాదిగ, బాల సాయిలు, రెడ్డపాక రవి, కొండపల్లి శివ పాల్గొన్నారు.