ఆటో కార్మికుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆటో కార్మిక దినోత్సవంకు సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆగస్టు 1వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న ఆటో కార్మిక దినోత్సవం ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, ఆటో కార్మీక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్, ఐలేందర్ యాదవ్, గందే మహేష్, నాయకులు కర్ర సూర్య శేఖర్, నేతి రవి వర్మ, మిడిదొడ్డి నవీన్,జిపి స్వామి, తదితరులు పాల్గొన్నారు.






