14-02-2026 10:39:38 AM
తల్లి బత్తుల శకుంతల బిఆర్ఎస్, కొడుకు బత్తుల.
శ్రీనివాస్ కాంగ్రెస్ విజయం పట్ల ,మున్సిపాలిటీ ప్రజల హర్షం.
తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఒకే కుటుంబంలో తల్లి ,కొడుకులు వేర్వేరు పార్టీలలో పోటీ చేసి, అరుదైన విజయ డంక మోగించిన సంఘటన చోటు చేసుకున్నది. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బత్తుల శకుంతల తల్లి బిఆర్ఎస్ పార్టీ నుండి 4 వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయగా, కొడుకైన బత్తుల. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుండి 7 వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి, విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించి, ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి, ఇరువురు ఘన విజయం సాధించారు.
ఏది ఏమైనాప్పటికీ గతంలో శీనన్న బిఆర్ఎస్ పార్టీలో పనిచేసి, వార్డు మెంబర్ గా రాణించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండి, అవకాశం రావడంతో కౌన్సిలర్ గా ప్రచారం చేసి గెలుపొందారు. ఏది ఏమైనా ఒకే కుటుంబంలో తల్లి, కొడుకులు రాజకీయాల్లో వేరైనాప్పటికీ, ఇరువురిని ప్రజలు గెలిపించుకోవడం పట్ల తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారు గెలిచిన వార్డులు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వేచి చూడాల్సిందే..