15 June, 2026 | 9:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

దోమలు బాబోయ్ దోమలు..

23-02-2026 12:04 AM

నిల్వ నీటితో ప్రజల ఇబ్బందులు

అశ్వాపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అశ్వాపురం జగదంబ షాప్ స్ట్రీట్ లైన్లోని సీసీ రోడ్డు, మూలవద్ద రోడ్ పగిలిపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో గత రెండేళ్లుగా మురికి నీరు నిల్వ ఉండటంతో అక్కడ ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.

నిల్వ నీటితో దోమలు అధికంగా పెరిగి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆ వీధి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వాసనతో పాటు దోమల సమస్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి సీసీ రోడ్డుకు మరమ్మతులు చేసి, నిల్వ నీటిని తొలగించి శుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.