calender_icon.png 8 February, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో దోమల దండయాత్ర

08-02-2026 01:11:33 AM

బెంబేలెత్తుతున్న జనం 

ఫాగింగ్ ఊసేది.. పారిశుద్ధ్యం ఏది? 

గ్లోబల్ సిటీలో దోమల మ్యూజిక్.. పట్టించుకోని బల్దియా అధికారులంటూ నెటిజన్ల ఫైర్

జీహెచ్‌ఎంసీపై రాజమౌళి కుమారుడు కార్తికేయ సెటైర్లు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా వెలుగొందుతోందని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుడు దోమల దండయాత్రతో విలవిలలాడుతున్నాడు. తాజాగా ఈ సమస్యపై సినీ దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి కుమారు డు, నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ సోషల్ మీడి యా వేదికగా చేసిన ఒక సెటైరికల్ వీడియో ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

జీహెచ్‌ఎంసీ పారిశుధ్య నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఈ వీడియో అద్దం పడుతోంది. కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో.. హైదరాబాద్‌లో దోమ లు ఎంత భయంకరంగా ఉన్నాయో వ్యం గ్యంగా చూపించారు. ఒక గదిలో దోమల రీంకారాలు, అవి మనుషులపై దాడి చేస్తున్న తీరును చూసి.. ఇది ఏదో భారీ యాక్షన్ సినిమా రేంజ్‌లో ఉందని నెటిజన్లు కామెం ట్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది.. దోమల సామ్రాజ్యం విస్తరించింది అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. కేవలం సెలబ్రిటీలే కాదు, సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలో దోమల బెడద భరించలేకపోతున్నామని కార్తికేయ పోస్టుకు మద్దతుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బల్దియా ఫాగింగ్ ఎక్కడ?

నగరంలో డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నా జీహెచ్‌ఎంసీ యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రతి గల్లీలోనూ సాయంత్రం వేళ ఫాగింగ్ యంత్రాలు కనిపించేవని, కానీ ఇప్పుడు వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. మురుగు కాల్వల పూడికతీత పనులు సక్రమంగా జరగకపోవడం, ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచిపోవడం దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

కోట్లలో ఖర్చు.. ఫలితం శూన్యం

దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఎంటమాలజీ విభాగంలో వం దలాది మంది సిబ్బంది పనిచేస్తున్నా, క్షేత్రస్థాయిలో దోమ ల ఉధృతి తగ్గకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శన మని విశ్లేషకులు భావిస్తున్నా రు. కార్తికేయ వంటి సెలబ్రిటీలే బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పం దించి, యుద్ధ ప్రాతిపదికన యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ నిర్వహించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.