12 May, 2026 | 11:18 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

రవాణా శాఖలో మరిన్ని సంస్కరణలు అమలు

25-01-2026 12:00 AM
  1. వాహనాల షోరూమ్‌ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్
  2. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : శనివారం నుంచి వాహనాల షో రూమ్‌ల(డీలర్ల) వద్దే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖలో మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయని, కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని తెలిపారు.

ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్‌ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారని, రవాణ శాఖలో అన్ని రకాల సేవలు ఆన్‌లైన్ లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరిందని, దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని స్పష్టం చేశారు. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందని, రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజ లంతా సహకరించాలని మంత్రికోరారు.