ఉప్పల్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి
జోన్ కమిషనర్‌కు ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి
ఉప్పల్ ఆగస్టు 7 విజయక్రాంతి: ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ మౌలిక వసతుల పనులకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయా లని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోన్ కమిషనర్ రాధిక గుప్త (ఐఏఎస్)ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయిం చాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఉప్పల్ ని యోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మె ల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.






