8 August, 2026 | 4:54 AM

కస్తూర్భాలో బాలికలకు భద్రత కరువు

08-08-2026 01:31 AM
  1. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
  2. నిర్లక్య దోరణిలో కస్తూరిబా గాంధీ సిబ్బంది

మోతె, ఆగస్టు7:- మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మం గళవారం అర్ధరాత్రి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రావి పహాడ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి సేవించి ప్రహరీ గోడ దూకి వసతి గృహంలోకి ప్రవేశించి ఓ మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో పాఠశాల భద్రతపై ప్రశ్నలు తలెత్తగా, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటన అనంతరం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వకుండా అంతర్గతంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన అంతా జరగడానికి గల కారణాలు స్థానికంగా మండలానికి చెందిన వంట మనుషులు స్కావెంజర్లు అటెండర్లు ఉండడంతోనే వారి సెల్ఫోన్లతోని విచ్చలవిడిగా విద్యార్థినిలు సెల్ ఫోన్లు ఇవ్వడంతోనే ఈ సంఘటనలు జరిగాయనే చర్చ జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల భద్రత లోపాల వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రాత్రి వేళల్లో ఓ వ్యక్తి సులభంగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించే పరిస్థితి ఎలా ఏర్పడిందని ప్రశ్నిస్తున్నారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినుల రక్షణకు తగిన భద్రతా చర్యలు అమలు చేశారా లేదా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.