ఉపాధి పని.. చేయకున్నా.. మనీ!
- ఉపాధి హామీ పథకం పనికి తూట్లు
- పట్నంలో ఉన్న గ్రామంలో పనిచేస్తున్నట్లు నమోదు
- సిబ్బంది చేతివాటం
తుంగతుర్తి,జూన్19 :పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పక్కదోవ పడుతున్నా యి. ఉపాధి పథకంలో పనిచేస్తున్న సిబ్బంది కూలీలు పనికి రాకుండా త మకు అనుకూలంగా మలుచుకుని క్యాష్ చేసుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామ న్న గూడెం తండా గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులే ఇందుకు నిద ర్శనం. గ్రామంలో పని. చేస్తున్న ఓ ఉపాధి సిబ్బంది గత 40 రోజుల నుండి 120 మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు వర్క్ షీట్ లో నమోదు చేసి అధికారులకు నివేదిక పంపాడు. కానీ 80 మందికి మాత్రమే పనులు కల్పించాడు.
ఇదిలా ఉండగా తండా కు చెందిన సుమారు 40 మంది పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వెళ్ళగా వారు గ్రామానికి వచ్చి పనులు చే యకున్నా ఫోన్లో, వీడియో కాల్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ చేసి సదరు మేటు వారికి హాజరు కల్పిస్తున్నట్లు పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. పనిచేసిన కూలీలు తమకు డబ్బులు జమ కాలేదని అడగగా వర్క్ షీట్ లో మీ పేర్లు డిలీట్ అయ్యాయని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. మండలం లో సంబంధిత ఏ ఒక్క అధికారి కూడా కనీసం పర్యవేక్షణ కూడా చేయట్లేదని, జరుగుతున్న సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ సొమ్ము ను కాజేయకుండా ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని పలువురు కూలీలు కోరుతున్నారు.
కూలీలకు బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను
రామన్నగూడెం తండా గ్రామపంచాయతీ పరిధిలో చెరువు కట్ట వద్ద కూలీలు పనిచేసినప్పటికీ వర్క్ పనులు డిలీట్ అయ్యాయి.తిరిగి వారికి మండల అధికారుల ద్వారా బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను.
రమేష్ నాయక్, ఉపాధి హామీ సిబ్బంది
జరిగిన సంఘటనపై విచారణ చేపడతాం
రామన్నగూడెం తండాలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతకలపై వి చారణ చేపట్టి సదరు మేటుపై చర్యలు తీసుకుంటాం.గత నెలలో జరిగిన పనులపై రికార్డులను పరిశీలించి జిల్లా అధి కారులకు నివేదిక పంపిస్తాం.పనిచేయకుండా తప్పుడు రికార్డులు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
కృష్ణయ్య, ఏపీఓ తుంగతుర్తి






