4 July, 2026 | 11:40 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజీ నియామకం

17-04-2026 01:44 AM

కామారెడ్డి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలకమండలి సభ్యులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్  పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కామారెడ్డి జిల్లా చెందిన మహమ్మద్ ఘాజిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యునిగా నియమిస్తూ గురువారం జీవో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో స్థాపించబడిన తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని మహమ్మద్ ఘాజి స్పష్టం చేశారు.