31 May, 2026 | 1:32 AM

రెండో రోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీట్

31-05-2026 12:33 AM
  1. గ్రీట్ కార్యక్రమం విజయవంతం
  2. చికాగోలోని నాపర్విల్లెలో నిర్వహణ
  3. నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన టీఆర్పీ అధినేత మల్లన్న

చికాగో, ఇల్లినాయ్ స్టేట్,యూఎస్‌ఏ: చికాగో నగరంలోని నాపర్విల్లేలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమైన ప్రవాస తెలంగాణవాసులు, అభిమానులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్ర మం సంభాషణ, విజన్, కమ్యూనిటీ అనే అంశాలపై సాగింది. తెలంగాణ భవిష్యత్తు, సామాజిక న్యాయం, బీసీల సాధికారత వంటి ముఖ్య అంశాలపై మల్లన్న తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొ న్నారు.

ఈ కార్యక్రమం శుక్రవారం సాయం త్రం 6 గంటలకు చికాగో నగరంలోని నాపర్విల్లేలోని మాల్ ఆఫ్ ఇండియాలో పరిమిత ఆహ్వానితులతో జరిగింది.  కార్యక్రమం నిర్వహణలో భాగస్వామ్యమైన నిర్వాహకులకు, హాజరైన ప్రతి ఒక్కరికీ తీన్మార్ మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు.