విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చెయ్యడం సిగ్గు చేటు
తాంసి/బీంపూర్ (విజయక్రాంతి):నీట్ పేపర్ లీక్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని, శాంతి యుతంగా ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చెయ్యడం సిగ్గు చేటు అని రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. గురువారం కాంగ్రెస్ నాయకులతో కలిసి తాంసి, భీంపూర్ మండలాలలో ఆయన పర్యటించారు. భీంపూర్ మండలం మార్కగూడ గ్రామపంచాయతిలో 15 లక్షలతో నిర్మించనున్న సీసీ, డ్రైనేజీ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామ పంచాయతీని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకోని నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మాజీ ఎంపీ మాజీ పరిశీలించారు.
అనంతరం అందర్ బంద్ లో నూతనంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. హైమస్ లైట్ లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి సరి కాదని అమాయక విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చెయ్యడం సమంజసం కాదన్నారు. రాహుల్ గాంధీని రక్తం వచ్చేలా చెయ్యడం ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఆ నాడు మణిపూర్ లో ఆదివాసులపై లాఠీ చార్జులు ఈరోజు విద్యార్థులపై లాఠీ చార్జులు చెయ్యడం సరైన పద్దతి కాదన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ నిద్ర పోతున్నారా అని ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఇంచార్జి ఆడే గజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డి, ఆత్మ చైర్మన్ అశోక్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






