కాంగ్రెస్ శాంతియుత నిరసన ర్యాలీ
ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడిపల్లి, జూలై 23 (విజయక్రాంతి): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ వరంగల్ హైవే పై బోడుప్పల్ కమాన్ నుండి మేడిపల్లి వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, వేధింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి, పిర్జాదిగూడ డివిజన్ల అధ్యక్షులు బొమ్మకు కళ్యణ్, పోగుల దిలీప్ రెడ్డి, బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి,బోడుప్పల్ మాజీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి,కొత్త కిషోర్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి, డీసీసీ సెక్రెటరీ ఏనుగు జలంధర్ రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మకు అజయ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ యాదవ్,మాజీ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






