24 July, 2026 | 11:06 AM

గొర్రెల దొంగలు అరెస్టు

24-07-2026 09:55 AM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి 1 టౌన్ పరిధిలో  గొర్రె దొంగతనం కేసులో 4 మంది నిందితులను పోలీసులు  అరెస్టు చేశారు.బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బుడిదగడ్డ బస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్లా  ఆటో డ్రైవర్_ కు 4 గొర్రెలు, 10 మేకలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఆయన తండ్రి జానీ గొర్రెలు, మేకలను మేతకు తీసుకువెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తీసుకొచ్చేవారు.

ఈ నెల 20న సింగరేణి ఫంక్షన్ హాల్ దగ్గర మేతకు తీసుకెళ్లగా, సాయంత్రం ఒక ఆడ గొర్రె కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి ఉంటారని అనుమానించి 21 న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దొంగతనం చేసిన గొర్రె విలువ సుమారు రూ. 10,000/-* ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన  మంచర్ల రమేష్ (చంద్రవెల్లి),కొట్ల వినోద్ కుమార్ (చాకేపల్లి),తిరుపతి గుజ్జ (చంద్రవెల్లి),ఎడిగిరాల శంకర్ (మాలాగురిజాల)లను అరెస్టు చేశారు. దొంగతనానికి ఉపయోగించిన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.కాగా నిందితులంతా ఆటోడ్రైవర్లూ కాగా ఈమేరకు నలుగురి నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.