31 May, 2026 | 1:06 AM

లారీల కోసం రైతుల నిరీక్షణ

31-05-2026 12:36 AM
  1. మొలకెత్తుతున్న ధాన్యం
  2. కొనుగోలు కేంద్రాన్ని పట్టించుకోని చైర్మన్!

చేగుంట, మే 30(విజయక్రాంతి): చేగుంట మండలం మక్కరాజుపేటలోని ఇబ్రహీంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం (సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, లారీల కొరత, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడం వంటి స మస్యలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతు లంబా డి భిక్షపతి కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు శనివారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. డి ప్యూటీ తహసీల్దార్ రమేష్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సుజాత అక్కడికి చేరుకుని రైతు ధాన్యం కుప్పలను పరిశీలించి పరిస్థితిని తెలుసుకున్నారు.

రైతులతో మాట్లాడి వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఘ టన జరిగిన తర్వాత కూడా ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మా ట్లాడుతూ, నెల రోజుల క్రితమే కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలు సకాలంలో అందుబాటులోలేకవేలాది బస్తాలు కేంద్రాల వద్ద పేరుకుపోయాయన్నారు. 

‘చైర్మన్ సాబ్ జరా దేఖో..

మా ధాన్యం తడిసి మొలకెత్తుతోంది, రై తులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తోంది. అయినా మీరు ఒక్కసారి కూడా కేంద్రానికి రాలేదు. మా సమస్యలు మీకు కనిపించడం లేదా’? అంటూ రైతులు ఆవేదనవ్యక్తం చేశా రు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు జోక్యంచేసుకోవాలని కోరారు.