24 July, 2026 | 11:06 AM

పేటలో పోలీస్ నాకా బంది

24-07-2026 09:58 AM

అశ్వారావుపేట జూలై23 (విజయక్రాంతి): నియోజక కేంద్రమైన అశ్వారావుపేట లో గురువారం పోలీసులు నాకాబంది నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజ్  ఆదేశాల మేరకు  అశ్వారావుపేట ఎస్సై టి యయాతి రాజు తన సిబ్బందితో  కలసి  స్థానిక రింగ్ సెంటర్ వద్ద నాకాబంది చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించి వాహనాల తనిఖీ చేసారు. ఈ తనిఖీలలో మొత్తం 256 వాహనాలను సోదా చేసి సరైన పత్రాలు లేని వారిపై  జరిమానా/ చలాన్లు వేశారు. 34 బైకులకు డ్రైవింగ్  లైసెన్స్ లేనివి, 16 నెంబర్ ప్లేట్ సరిగా లేనివి, 7 సీటు బెల్టు ధరించని కారు డ్రైవర్ల కి, ఒకరికి సెల్ఫోన్ డ్రైవింగ్ మరియు 78 వాహనాలకు ఫైన్ రియలైజేషన్ వేయడం జరిగింది. సరైన పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాల ను డీటెయిన్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ లో అశ్వారావుపేట  ఎస్ హెచ్ ఓ టి యయాతిరాజు ,  సిబ్బంది పాల్గొన్నారు.