22 August, 2026 | 7:03 PM

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం

22-08-2026 06:07 PM

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్, భౌరంపేట్ డివిజన్ పరిధిలోని సింహపురి కాలనీ డి బ్లాక్, లహరి గ్రీన్ పార్క్ కాలనీలలోని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ సౌకర్యాలు, పార్కు అభివృద్ధి, పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటుతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు. అనంతరం శంభీపూర్ రాజు మాట్లాడుతూ మెరుగైన సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు.కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, భౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళి యాదవ్, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, శంకర్ నాయక్, నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, సంజీవ్, గోపాల్, కిరణ్, సాంబ శివారెడ్డి, ఏఈ సురేందర్ నాయక్, సింహపురి కాలనీ డి బ్లాక్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, లహరి గ్రీన్ పార్క్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.