22 August, 2026 | 8:57 PM

ముత్యాలమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి

22-08-2026 06:10 PM

అమ్మవారికి... కిలో వెండి కిరీటాన్ని బహుకరించిన మేకల అయ్యప్ప

కనుల పండుగగా వేడుకలు... అలరించిన ఆలయ ప్రాంగణం

జవహర్ నగర్,(విజయక్రాంతి): ముత్యాలమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తెలంగాణలో సరైన వర్షాలు లేక రైతులు కరువును ఎదుర్కొంటున్నారని వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆకాంక్షించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ శాంతినగర్లో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మేయర్ మేకల కావ్య హాజరై మాట్లాడుతూ దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయంగా నిలుస్తాయని ప్రజలు ధర్మమార్గంలో పయనించాలని అన్నారు. బిఆర్ఎస్ జిల్లా నాయకుడు పారిశ్రామికవేత్త మేకల అయ్యప్ప అమ్మవారికి కిలో వెండి కిరీటాన్ని అందజేశారు . ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు సుధాకర్ చారి, భార్గవ్ రామ్, ప్రసాద్ గౌడ్, బాలరాజ్ పటేల్ వెంకటేష్ గౌడ్ జలంధర్ నవీన్ గౌడ్ నరసింహ అశోక్ బిఆర్ఎస్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.