పేదల ఆత్మగౌరవాన్ని పెంచుతున్న ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ : ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరాన్ని పెంచుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం తిర్మల్ కుచ్చు తాండాలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన పేదల సంక్షేమం ప్రధాన లక్ష్యమని, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 4500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
గత పాలనలో డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలకు అన్యాయం జరిగిందని విమర్శలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా, లబ్ధిదారులకు గృహప్రవేశ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య , యాదన్న యాదవ్, రమేష్ నాయక్ యాదవ్, రఘుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు.






