రాష్ట్రాన్ని ఆగం చేసి అద్భుతంగా నటిస్తుండ్రు
- పాదయాత్ర, మొక్కల యాత్రలు చేసినా ఫలితం శూన్యం
బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో విస్మరించారు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గత పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఆగం చేసి అద్భుతంగా నటిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాదయాత్రలు మోకాదయాత్రలు ఎన్ని చేసినా ప్రజల నుంచి వారికి వచ్చే ఫలితం శూన్యమని విమర్శించారు. అమెరికాకు వెళ్లి అక్కడ కూడా తెలంగాణ పరువు బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీస్తున్నారని, మంచి పనులు జరుగుతుంటే ఓర్వలేక విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్ -2047లో భాగమే భారత్ ఫ్యూచర్ సిటీ కి, సీఎం రేవంత్ రెడ్డి అద్భుత నగర నిర్మాణానికి ప్రణాళిక వేస్తున్నారని తెలిపారు. ముంబై–నవీ ముంబై తరహాలో హైదరాబాద్‌కు కొత్త నగరం-భారత్ ఫ్యూచర్ సిటీ అని,నోయిడా, గురుగ్రామ్ తరహాలో లేటెస్ట్ టెక్నాలజీ మహానగరం రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన 13,500 ఎకరాలుకు పునాదని, మరో 30 వేల ఎకరాలతో బ్రహ్మాండమైన ఫ్యూచర్ సిటీ ఆవిష్కృతం కాబోతుందని తెలిపారు.
ఏఐ,డిజిటల్ సర్వీసెస్‌కు ప్రత్యేక జోన్గా, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్‌కు ప్రాధాన్యం ఉంటుందని, గ్రీన్ ఫార్మా జోన్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ల్,ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం జోన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 12 ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని, ఫ్యూచర్ సిటీ ద్వారా 20 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుకోసమే భారీ ప్రణాళిక చేస్తున్నామని, గ్రామీణ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు,ఫ్యూచర్ సిటీకి పారిశ్రామిక దిగ్గజాల మద్దతు అవసరం అన్నారు.
మచిలీపట్నం పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, 250 కిలోమీటర్ల హైవే సీఎం రేవంత్ గొప్ప విజన్, ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామన్న హరీష్ రావు, తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడమే హరీష్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురు సభ్యులు రాజకీయంగా బతికేందుకు, రాష్ట్రంలోని 40 లక్షల మంది యువత భవిష్యత్తును గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుబడిదారులను భయపెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో విస్మరించారన్నారు. ఎన్ని చేసినా బీఆర్ఎస్ ఇక లేవదన్నారు.






