15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

26-01-2026 06:25 PM

వనపర్తి: వనపర్తి పట్టణంలోని భగీరథ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ట్రెండ్స్ మచ్చావస్త్రదుకానాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్ కు చెందిన యువకులు శాంతి వర్ధన్, రాహుల్లను ఎమ్మెల్యే అభినందించారు.

దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి వ్యాపార సముదాయాల ఏర్పాటు లాభదాయకంగా ఉంటుందని యువకులు ఉద్యోగ కల్పనతో పాటు ఇలాంటి ఉపాధి, వ్యాపార అవకాశాలపై కూడా దృష్టి సారిస్తే భవిష్యత్తు బాగుంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. యువకులు చెడు మార్గాలలో కాకుండా భవిష్యత్తు బాగుండే మార్గాలను ఎంచుకొని ముందుకు నడవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.