జిల్లా ఎస్పీని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పోలీసుల పై తీరుపై అసహనం వ్యక్తం చేయడం కాకుండా ఇందిరమ్మ లబ్ధిదారులపై అక్రమ ఇసుక తరలింపు కేసులు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. తదనంతరం రెండు రోజుల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్కార్ట్ ను పోలీసు అధికారులు తొలగించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జిల్లా ఎస్పీని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలవడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఎస్కార్ట్ విషయంలో చర్చించారు, లేక పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య పొరపొచ్చాలు ఎక్కడ వచ్చాయని అనే విషయాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పోలీసుల తీరు పట్ల జుక్కల్ ఎమ్మెల్యే గుర్రుగా ఉన్న విషయం విధితమే. ఎస్పీ రాజేష్ చంద్ర ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలవడంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వార్ సమసిపోయినట్లేని పలువురు భావిస్తున్నారు.






