31 July, 2026 | 1:32 PM

కేసీఆర్ మళ్ళీ రావాలంటూ వరి నాట్లు

31-07-2026 12:30 PM

రాజాపూర్ జులై 31:  మండల కేంద్రంలోని రైతు జహంగీర్ పొలంలో వరి నారు వేయడానికి వచ్చిన మహిళలు నారుతో మడిలో కేసీఆర్ అనే పదం రాసి నారు వేయడం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ పాటలతో నృత్యాలు చేసి నాటారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతుబంధు డబ్బులు సకాలంలో బ్యాంకులో జమ అయ్యేదని కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా డబ్బులు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం,  కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నామని మహిళలు తెలిపారు.