1 June, 2026 | 9:20 PM

వేయి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం

01-06-2026 08:18 PM

* గత ప్రభుత్వ పాలనలో మోసపూరిత హామీలు

* అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

* తిండి కుడి కాలువ మరమ్మత్తు పనుల ప్రారంభం

అచ్చంపేట: గత ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను.. రైతులను మభ్యపెట్టిందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనే సంక్షేమంగా పనిచేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. సోమవారం డింటి ప్రాజెక్ట్ కుడి కాలువ మనుమతి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. కుడికాలువతో లతీపురు పెరిమిళ్ళ గువ్వలోనిపల్లి గ్రామాలకు చెందిన 30 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కాల్వపనులను విస్తరిస్తే వెయ్యి ఎకరాల వరకు నీళ్లను అందించే అవకాశం ఉంటుందన్నారు.

ఇదే విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్ళు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కెనాల్ ద్వారా కల్వకుర్తి నుంచి హాజీపూర్ వరకు సాగునీరు అందించేందుకు తన వంతు ప్రయత్నం ఉంటుందన్నారు. ఆగిపోయిన కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా రాబోయే అక్టోబర్లోగా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.