1 June, 2026 | 9:20 PM

పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు

01-06-2026 08:23 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): పీఎం సూర్యా ఘర్ యోజన పథకం కింద సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రెండు కిలోవాట్లు ఏర్పాటు చేసుకుంటే రూ.60 వేల, సబ్సిడీ లభిస్తుంది. 240 యూనిట్లు నెలకి ఉత్పత్తి చేస్తుంది.మూడు కిలోవాట్లు ఏర్పాటు చేసుకుంటే 78,000 సబ్సిడీ లభిస్తుంది. 360 యూనిట్లు నెలకు ఉత్పత్తి చేస్తుంది.

మండలంలోని గోపాల్పేట గ్రామంలో సురేష్ రెడ్డి మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా గృహ విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడగలరని తెలియజేశారు.సిగర్ ఇంజనీరింగ్ ఆడిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది.