31 July, 2026 | 1:32 PM

మంచి స్నేహితుడిని కోల్పోయా

31-07-2026 12:32 PM

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణ రాజకీయాలకు తీరని లోటు... లావుడియా రాములు నాయక్

కారేపల్లి జూలై 31, (విజయక్రాంతి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసిన నాయకుడిని, ఎంతోకాలంగా తనకు సన్నిహిత మిత్రుడిని కోల్పోవడం తీవ్ర విషాదానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని అన్నారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.