31 July, 2026 | 1:33 PM

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల దొడ్డా రమేష్ సంతాపం

31-07-2026 12:34 PM

దమ్మపేట, జూలై 31(విజయక్రాంతి): నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందడం అత్యంత బాధాకరమని  దమ్మపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో వరంగల్ జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు.

ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని, పార్టీ పట్ల అత్యంత విధేయతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.