19 May, 2026 | 11:35 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

మహా శివరాత్రి సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు

15-02-2026 06:28 PM

- తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శనాలు

సనత్‌నగర్,(విజయక్రాంతి): పరమశివుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమీర్ పేటలో...

అమీర్ పేట డివిజన్ లోని హనుమాన్ టెంపుల్, గురుమూర్తి నగర్ లోని శ్రీ వినాయక టెంపుల్ లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దరహించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వినాయక టెంపుల్ లో శివలింగానికి పాలతో అభిషేకం చేసి పూజలు జరిపారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఈఓలు జయంతి, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, ప్రకాష్ గౌడ్, కట్టా బలరాం, శివ, సత్యనారాయణ యాదవ్, ఉత్తమ్ సింగ్ తదితరులు ఉన్నారు.

సనత్ నగర్ లో...

మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్ లో గల శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన ను ఆలయ పండితులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, ప్రదీప్ గౌడ్, ఖలీల్, అర్జున్ గౌడ్, జమీర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.