16 July, 2026 | 3:09 PM

ప్రపంచ పాముల దినోత్సవం

16-07-2026 02:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పాముల దినోత్సవం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ నజీర్ ఖాన్, ఉప అటవీ క్షేత్ర అధికారి (Deputy Range Officer), సారంగాపూర్ మాట్లాడుతూ... పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పాముల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

పాములు ఎలుకలు వంటి పంటలకు హాని చేసే జీవులను నియంత్రించడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అందువల్ల వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పాముల కన్నీటికి విషం ఉండదని కొన్ని పాములకు మాత్రమే తెలిపారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ మరియు సామాజిక సేవకుడు షేర్ యాసిన్ పాల్గొని పాముల సంరక్షణలో తాను అందిస్తున్న సేవలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేక్ క్యాచర్ షేర్ యాసిన్ గారిని వారి సేవలను గుర్తిస్తూ అటవీ శాఖ ఆధ్వర్యంలో సన్మానించనైనది.