calender_icon.png 15 February, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక..

15-02-2026 06:32:43 PM

- సబ్ కలెక్టర్ మనోజ్ వెల్లడి

- కాంగ్రెస్ విప్ జారీ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఎట్టకేలకు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఈ నెల 16న జరుగుతాయి. ఈ మేరకు బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి మనోజ్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతుందన్నారు.

నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. ముందుగా  చైర్ పర్సన్, ఆ తర్వాత  వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు. పరోక్ష పద్ధతిలోనే చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు. సభ్యులు ఈ ఎన్నికల్లో  తమకు నచ్చిన అభ్యర్థికి ఓటువేసినట్టు చెయ్యి నీ పైకి ఎత్తాలని తెలిపారు.

మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు విప్పు జారీ చేసినట్లు అధికారికంగా ఫారం1 అందజేసినట్టు తెలిపారు. విప్ జారీ తో  కాంగ్రెస్ నుంచి గెలుపొందినా కౌన్సిలర్లు ఆ పార్టీ  ఎంపిక చేసిన చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కు మాత్రమే ఓటు వేయాలని నిబంధన అని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహణ కోసం  స్పెషల్ ఆఫీసర్ గా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను  నియమిస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు.